భారతదేశం, డిసెంబర్ 29 -- 'ది రాజా సాబ్' (The Raja Saab) ట్రైలర్ 2.0 చివర్లో ప్రభాస్ కనిపించిన 'జోకర్' గెటప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం ఒక సినిమా లుక్ మాత్రమే కాదని, 2024లో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ.. ప్రభాస్‌ను ఉద్దేశించి చేసిన 'జోకర్' కామెంట్స్‌కు ఇది గట్టి కౌంటర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న 'ది రాజా సాబ్' ట్రైలర్ 2.0 ను సోమవారం (డిసెంబర్ 29) రిలీజ్ చేసిన సంగతి తెలుసు కదా. ఇందులో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించినా.. క్లైమాక్స్‌లో వచ్చిన ఆ ఒక్క షాట్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

ట్రైలర్ చివర్లో.. ప్రభాస్ సూట్ వేసుకుని, చేతిలో ఒక భారీ సుత్తి పట్టుకుని తలదించుకుని ఉంటాడు. తల పైకి ఎత్తగానే.. ముఖానికి తెల్లటి రంగు, వింతైన మేకప్ వేసుకుని అచ్చం హాలీవుడ్ సినిమా 'జోకర్' లాగా క...