Hyderabad, అక్టోబర్ 2 -- కాంతార ఛాప్టర్ 1తో రిషబ్ శెట్టి మరోసారి కాంతార మ్యాజిక్ రిపీట్ చేశాడు. గురువారం (అక్టోబర్ 2) రిలీజైన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచీ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు. రిషబ్ శెట్టికి శుభాకాంక్షలు చెప్పాడు.

కాంతార ఛాప్టర్ 1 మూవీ థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల తర్వాత ప్రభాస్ తన రివ్యూ పోస్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ రెబల్ స్టార్ తన రివ్యూ ఇచ్చాడు. "కాంతార ఛాప్టర్ 1 బ్రిలియంట్ మూవీ. ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. రిషబ్ శెట్టి, విజయ్ కిరగండూర్, హోంబలే ఫిల్మ్స్ కు కంగ్రాచులేషన్స్" అని ప్రభాస్ తన స్టోరీలో రాశాడు.

కాంతార ఛాప్టర్ 1పై ప్రభాస్ రివ్యూ ఇలా

ప్రభాస్ ఇచ్చిన రివ్యూపై మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వా...