Hyderabad, జూలై 16 -- రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య హాలీవుడ్ రిపోర్టర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ప్రధానంగా హోంబలే ఫిల్మ్స్ తో తాను చేయబోయే ప్రాజెక్టులపై స్పందించాడు. ఇప్పటికే ఈ టాప్ ప్రొడక్షన్ కంపెనీతో సలార్ మూవీ చేసిన అతడు.. భవిష్యత్తులో మూడు సినిమాలు చేయబోతున్నట్లు గతంలోనే తేలగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువే అని ప్రభాస్ చెప్పడం విశేషం.

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. హోంబలే ఫిల్మ్స్‌తో తన మూడు చిత్రాల ఒప్పందం, ఆ సంస్థతో తన సన్నిహిత సంబంధం గురించి హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడాడు. 2023లో విడుదలైన యాక్షన్ ఎపిక్ 'సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్' తర్వాత హోంబలే ఫిల్మ్స్‌తో మరిన్ని ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నట్లు ప్రభాస్ వెల్లడించాడు.

ప్రభాస్, హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్ కిరగండూర్‌తో తన సంబంధం గురించి మాట్లాడుతూ.. "విజయ్ కిరగండూర్‌లోని ...