భారతదేశం, డిసెంబర్ 28 -- హైదరాబాద్‌లో శనివారం (డిసెంబర్ 27) జరిగిన 'ది రాజా సాబ్' (The Raja Saab) ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్ లోని వాళ్లు మాట్లాడిన విషయాలు చాలా మందిలో ఆసక్తి రేపుతున్నాయి.ముఖ్యంగా వేదికపై డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. రాజమౌళి ప్రభాస్‌ను ఒక "మీడియం రేంజ్ హీరో" స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మార్చారని అనడం ఇప్పుడు దుమారం రేపుతోంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య అట్టహాసంగా జరిగింది. అయితే ఎమోషనల్ స్పీచ్ ఇస్తున్న క్రమంలో డైరెక్టర్ మారుతి నోటి నుంచి వచ్చిన ఒక మాట ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది.

తెలుగు సినిమా రేంజ్ గురించి మాట్లాడుతూ మారుతి ఒక ఉదాహరణ చెప్పాడు. "నేను సౌత్ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తికి...