భారతదేశం, డిసెంబర్ 27 -- ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది రాజా సాబ్' (The Raja Saab) నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో ప్రభాస్ గెటప్, లుక్ ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు చూడని విధంగా ఉంటాయని, పాన్ ఇండియా ఆడియెన్స్ సర్ప్రైజ్ అవుతారని మారుతి హైప్ పెంచేశాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా 'ది రాజా సాబ్' కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు మారుతి ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశాడు.

ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించే మాటలు మారుతి చెప్పాడు. "ప్రభాస్ గారిలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. కానీ పాన్ ఇండియా ఆడియెన్స్ ఇప్పటివర...