భారతదేశం, జనవరి 9 -- రెబల్ స్టార్ ప్రభాస్ హారర్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ 'రాజా సాబ్'తో థియేటర్లలోకి వచ్చేశాడు. మాస్-యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ లోకి తిరిగి వచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నప్పటికీ, పాన్-ఇండియా స్థాయిలో ఆదరణ కొంచెం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్ నంబర్లు ఇందుకు కారణం. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభాస్ గత సినిమాలు కల్కి 2898 ఏడీ, సలార్ కంటే తక్కువగా ఉన్నాయి.

మారుతి దర్శకత్వం వహించిన 'రాజా సాబ్' తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో దేశవ్యాప్తంగా ఈ రోజు (జనవరి 9) రిలీజైంది. శుక్రవారం ఉదయం నాటికి, కేవలం తెలుగు భాషా వెర్షన్ కోసమే ఓపెనింగ్ రోజుకు 5 లక్షలకు పైగా టిక్కెట్లను విక్రయించింది.

అయితే, మిగిలిన నాలుగు డబ్బింగ్ వె...