భారతదేశం, జనవరి 14 -- వింటేజీ లుక్, చాలా కాలం తర్వాత కామెడీ, డ్యాన్స్ లతో ప్రభాస్.. ఇలా చాలా అంచనాలు, ఆశలతో థియేటర్లలోకి వచ్చింది ది రాజా సాబ్. మిక్స్ డ్ టాక్ అందుకున్నా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్ సాధించింది. కానీ ఆ తర్వాత మూవీ ముందుకు సాగడం కష్టంగా మారింది. అయిదో రోజు అయితే అత్యంత దారుణంగా కేవలం రూ.4.85 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.

ప్రభాస్ నటించిన హారర్ కామెడీ సినిమా రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ప్రదర్శన చేస్తోంది. సినిమాలో కొత్త సీన్లు యాడ్ చేసినా ఆడియన్స్ రాజా సాబ్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయిదో రోజు (జనవరి 13) ఈ సినిమా ఇండియాలో రూ.4.85 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించిందని ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ పేర్కొంది. జనవరి 9న రిలీజైన రాజా సాబ్ మూవీకి ఓ రోజులో వచ్చిన అతి తక్కువ కలెక్షన్లు ఇవే.

సక్నిల్క్ ప్రకారం రా...