భారతదేశం, నవంబర్ 4 -- రష్మిక మందన్న ఇప్పుడు ఇండియాలో చాలా బిజీ హీరోయిన్. 2025లో ఆమె నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అంటూ అయిదో మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. మరోవైపు తన రీసెంట్ హారర్ థ్రిల్లర్ థామా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో కలిసి నటించాలనే కోరికను వెల్లడించింది రష్మిక.

థామాలో రక్త పిశాచిగా రష్మిక మందన్న అదరగొట్టింది. ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. ఈ నేషనల్ క్రష్ ఇప్పటికే రణబీర్ కపూర్ నుండి అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్ వరకు పలువురు పెద్ద స్టార్లతో కలిసి పనిచేసింది. అయితే ఒక ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయాలని ఆమె కోరుకునే నటుడు ఎవరైనా ఉన్నారంటే, అది ప్రభాస్.

ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో అభిమానుల ప్రశ్నలకు రష్మిక మందన్న సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఒక అభిమాని కింద పడుకొని ఉన్ని బ్రహ్...