భారతదేశం, డిసెంబర్ 7 -- తెలుగులో రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ఇట్స్ ఓకే గురు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో నటించిన ఉష శ్రీ ఇట్స్ ఓకే గురు మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సాయి చరణ్ హీరోగా చేశాడు. క్రాంతి ప్రసాద్ నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా మణికంఠ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఇట్స్ ఓకే గురు మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక డిసెంబర్ 12న ఇట్స్ ఓకే గురు థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల డిసెంబర్ 6న ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్.

ఈ ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డైరెక్టర్ మెహర్ రమేష్ అతిథిగా వచ్చారు. ప్రభాస్ స్టైలిష్ ఫిల్మ్ బిల్లా సినిమాలో డార్లింగ్‌కు చెల్లెలుగా నటించిన హీరోయిన్ ఉష శ్రీ. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ...