భారతదేశం, డిసెంబర్ 1 -- పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ కాప్ డ్రామా 'స్పిరిట్' (Spirit). ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ ఐకాన్ కాజోల్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మూవీ అంటేనే ఎంతో ఆసక్తి రేపుతోంది. దీనికి స్పిరిట్ అనే టైటిల్, ఈ మధ్య వచ్చిన ఆడియో ఇంట్రడక్షన్ గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ఇందులో బాలీవుడ్ నటి కాజోల్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మొదట బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ను సంప్రదించి...