భారతదేశం, జనవరి 8 -- ప్రస్తుతం ఎక్కడ చూసినా 'ధురంధర్' సినిమా పేరే వినిపిస్తోంది. రికార్డుల వేటలో అలుపెరగని ఈ చిత్రం తాజాగా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ సినిమాలో 'యాలీనా' పాత్రలో అద్భుతంగా నటించిన యంగ్ సెన్సేషన్, న్యూ హీరోయిన్ సారా అర్జున్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు.

ఐఎండీబీ (IMDb) తాజాగా విడుదల చేసిన ఈ వారపు పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు బ్యూటిపుల్ సారా అర్జున్.

ప్రతి వారం అభిమానుల ఆసక్తిని బట్టి ఐఎండీబీ ఈ జాబితాను విడుదల చేస్తుంది. గత వారం రెండో స్థానంలో ఉన్న సారా అర్జున్ తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి ఈసారి టాప్ 1 ప్లేస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె దళపతి విజయ్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి అగ్ర హీరోలతోపాటు అగస్త్య నంద వంటి స్టార్లను కూడా ఓడించి వెనక్కి నేట్టేసింది.

ఇ...