Hyderabad, ఏప్రిల్ 24 -- ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రతి ఏడాది ఏప్రిల్ 25న నిర్వహించుకుంటారు. దోమల వల్ల వచ్చే వ్యాధుల్లో మలేరియా ఒకటి. భారతదేశంలో మలేరియా కేసులు, ఆ జ్వరం కారణంగా మరణాలు అధికంగా నమోదవుతూనే ఉన్నాయి. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. మీ కుటుంబంలో ఉన్న వారికి ఎవరికైనా మలేరియా వస్తే ఈ హోం రెమెడీస్ పాటిచేందుకు ప్రయత్నించండి.

పసుపు భారతీయ ఇళ్లలో రోజూ ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. ప్లాస్మోడియం ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడే శరీరం నుండి విషాన్ని బయటకు పంపడానికి పసుపు సహాయపడుతుంది. పసుపు మలేరియా పరాన్నజీవులను తొలగించడానికి సహాయపడుతుంది. దీని శోథ నిరోధక లక్షణాలు కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయ. ఇవి మలేరియాలో సాధారణం. మలేరియాను ఎదుర్కోవడానికి, ప్...