భారతదేశం, జూలై 20 -- ఇండియన్ యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద అదరగొట్టాడు. మూడు రోజుల్లో రెండు సార్లు ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ ను ఓడించాడు. లాస్ వెగాస్‌లో జరిగిన ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్‌స్లామ్ ఓపెనింగ్ గేమ్ లో నార్వే దిగ్గజ గ్రాండ్ మాస్టర్ కార్ల్ సన్ ను ఓడించాడు.

చెస్.కామ్ ప్రకారం 19 ఏళ్ల భారత చెస్ సెన్సేషన్ ఆర్.ప్రజ్ఞానంద తెల్లటి పావులతో ఆడాడు. కార్ల్ సన్ పై ఆధిక్యం ప్రదర్శించాడు. 41 ఎత్తుల్లో ప్రపంచ నంబర్ వన్ ను చిత్తుచేశాడు. ప్రజ్ఞానంద క్లినికల్ గా గేమ్ తో, కచ్చితమైన ఎత్తులతో ఆడాడు. వ్యూహాత్మక గేమ్ ప్లాన్ ను ప్రదర్శించాడు. 18వ కదలికలో బిషప్, నైట్‌కు బదులుగా తన రాణిని త్యాగం చేయాలని నార్వేజియన్ గ్రాండ్ మాస్టర్ కార్ల్ సన్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ సవాలును స్వీకరించిన భారత ఆటగాడు ఆట చివరిలో పైచేయి సాధించాడు...