Hyderabad, మే 6 -- ఆస్తమా వ్యాధి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వస్తోంది. ఆ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది 'వరల్డ్ ఆస్తమా దినోత్సవం' నిర్వహిస్తారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉబ్బసం రెండింటిలో దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల రెండు వ్యాధుల లక్షణాల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం.

గ్లోబోకాన్ 2022 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నిర్ధారణ అయిన మొత్తం క్యాన్సర్ కేసులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ సుమారు 12.5 శాతం ఉంది. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ఆస్తమా 300 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోంది. ఏడాదికి అయిదు లక్షల మంది మరణాలకు కారణమవుతోంది.

కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ, కొన్ని కారకాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ రెండు వ్యాధులపై అవగాహన పెంచుకోవచ్చు. ఛాతీ నొప్పి, దగ్గినప్పుడు రక్తం పడడం వంటివి ఊపిర...