భారతదేశం, డిసెంబర్ 25 -- థాయ్‌లాండ్-కాంబోడియా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు చివరకు ఒక పవిత్ర విగ్రహం కూల్చివేతకు దారితీయడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. రెండు దేశాల మధ్య గత రెండు వారాలుగా సాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో, థాయ్ సైన్యం సోమవారం నాడు అక్కడ ఉన్న భగవాన్ విష్ణువు విగ్రహాన్ని ధ్వంసం చేసింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం బుధవారం తీవ్రంగా స్పందించింది.

"సరిహద్దు వివాదాలు ఏవైనా ఉండవచ్చు.. కానీ ఇలాంటి అగౌరవపూరితమైన చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

ఈ వివాదాస్పద ప్రాంతంలో ఉన్న దేవతామూర్తులను ఆ ప్రాంత ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారని, ఇది మన ఉమ్మడి నాగరికతలో ఒక భాగమని రణధీ...