భారతదేశం, డిసెంబర్ 3 -- బాలకృష్ణ, బోయపాటి శ్రీను టీమ్ ప్రస్తుతం అఖండ 2 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ శుక్రవారం (డిసెంబర్ 5) సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర చోట్లా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. బుధవారం (డిసెంబర్ 3) మూవీ టీమ్ చెన్నైలో మీడియాతో మాట్లాడగా.. బాలయ్య బాబు తమిళంలో ఇరగదీశాడు.

అఖండ 2 మూవీ ప్రస్తుతం ఎంతో ఆసక్తి రేపుతోంది. బాలకృష్ణ, బోయపాటి ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన వేళ ఈ రాబోయే సినిమాపైనా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో రిలీజ్ కానుండటంతో మూవీ టీమ్ ఆయా భాషల్లో ప్రమోషన్లు నిర్వహిస్తోంది. తాజాగా బుధవారం (డిసెంబర్ 3) చెన్నై వెళ్లింది. ఎక్కడికి వెళ్లినా బాలయ్య ఆ భాషల్లో మాట్లాడుతున్నాడు.

చెన్నైలోనూ అతడు తమిళంలో మాట్లాడాడు. తాను మద్రాస్ లో పుట్టానని, అందుకే ఇది నా జన్మభ...