భారతదేశం, ఆగస్టు 2 -- ప్రపంచంలోనే అత్యంత అరుదైన రక్త వర్గాన్ని కనుగొన్నారు. కర్ణాటకకు చెందిన 38 ఏళ్ల మహిళ శరీరంలో అరుదైన రక్త వర్గం ఉంది. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని CRIB అనే కొత్త యాంటిజెన్ ఆ మహిళ రక్తంలో గుర్తించారు. ప్రపంచంలో ఒకే ఒక మహిళకు ఈ అరుదైన రక్త వర్గం ఉందని వైద్యులు చెప్పారు.

కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన మహిళ శరీరంలో ఈ అరుదైన రక్త గ్రూపును గుర్తించారు. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న ప్రపంచంలోనే ఆమె ఏకైక మహిళగా నిలిచింది. ఈ మహిళకు రక్తం అవసరమైతే, ప్రపంచంలో ఎవరూ ఆమెకు రక్తం ఇవ్వలేరు. ఆమె తన రక్తాన్ని ముందుగానే దాచుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

వైద్య పరీక్షల్లో భాగంగా మహిళ రక్తాన్ని బెంగళూరులోని టీటీకే బ్లడ్ సెంటర్‌లోని అడ్వాన్స్‌డ్ ఇమ్యునోహెమటాలజీ రిఫరెన్స్ ల్యాబ్‌కు పరీక్షకు పంపించారు. వైద్యులు ఆమె రక్తాన్ని వేర్వేరు రక్త గ్రూపులతో ...