భారతదేశం, జూలై 16 -- ప్రపంచంలోనే మెుట్టమెుదటి ఏఐ చెఫ్ ఐమాన్ దుబాయ్‌లో త్వరలో ప్రారంభమయ్యే కొత్త రెస్టారెంట్ వూహూలో అడుగుపెట్టనుంది. ఈ రెస్టారెంట్ సెప్టెంబర్‌లో బుర్జ్ ఖలీఫా సమీపంలో ప్రారంభం కానుంది. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే ఏఐ చెఫ్‌గా ఉండే మొదటి రెస్టారెంట్ అవుతుంది. అవును నిజమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రెస్టారెంట్‌లో చెఫ్‌గా కనిపిస్తుంది. ప్రపంచంలోనే ఏఐని చెఫ్‌గా ఉపయోగించే మొదటి రెస్టారెంట్ ఇదే అవుతుంది.

ఏఐ చెఫ్‌ల విషయంలో రెస్టారెంట్లలో ఆహారాన్ని ఇప్పుడు ఏఐ తయారు చేస్తుందా? అని మీరు ఆలోచించవచ్చు. ఆహారాన్ని ఏఐ తయారు చేయదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతానికి మనుషులే ఆహారాన్ని తయారు చేస్తారు. కానీ రెస్టారెంట్ మెనూ, వాతావరణం, సేవలకు ప్రత్యేక ఏఐ మోడల్ చెఫ్ ఐమాన్ ఉపయోగపడుతుంది.

వార్తా సంస్థ రాయిటర్స్ నివ...