భారతదేశం, నవంబర్ 26 -- హైదరాబాద్‌ రాయదుర్గం టీ హబ్‌లో ప్రపంచంలో తొలి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఇంద్రజాల్ రేంజర్‌ను ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా ప్రతాప్‌ పాండే మాట్లాడారు. భవిష్యత్‌లో దేశాల మధ్య యుద్ధాలు కేవలం ఆయుధాలతో మాత్రమే ఉండవు అన్నారు. వీటిల్లో డ్రోన్స్‌ పాత్ర ఆందోళనకరంగా మారుతుందని చెప్పారు. దేశంలోనికి పాకిస్థాన్ పలుసార్లు పంపిన డ్రోన్లను మన బలగాలు నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం కూడా అలాంటి అనుమానాస్పద డ్రోన్లను కూల్చుతుందన్నారు.

'రక్షణ పరంగా చాలా కీలకమైన ముందడుగు అవుతుంది. ఇంద్రజాల్ సంస్థకు ప్రత్యేకమైన అభినందనలు. దేశ భద్రత విషయంలో కీలక పరిణామం.'అని ప్రతాప్‌ పాం...