భారతదేశం, జనవరి 15 -- పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) మైదానంలోనే కాదు.. సంపాదనలోనూ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న అథ్లెట్ గా అతడు తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజాగా వెలువడిన 2025 అత్యధిక సంపాదన కలిగిన స్పోర్ట్స్ పర్సన్స్ జాబితాలో రొనాల్డో వరుసగా మూడో ఏడాది కూడా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. టాప్ 10లో ఏ ఒక్క క్రికెటర్ కు కూడా చోటు దక్కలేదు.

ఈసారి జాబితాలో కొన్ని అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీని వెనక్కి నెట్టి, మెక్సికన్ బాక్సర్ సాల్ కానెలో అల్వారెజ్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. 2025లో అమెరికన్ బాక్సర్ టెరెన్స్ క్రాఫోర్డ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక పోరులో అల్వారెజ్ ఓడిపోయినప్పటికీ.. ఆ మ్యాచ్ ద్వారా అతనికి ...