Hyderabad, మార్చి 12 -- గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న రోజులివి. కొన్నిచోట్ల స్వచ్ఛమైన గాలిని కాసేపు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా పీల్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అందుకే శాస్త్రవేత్తలు ఈ ప్రపంచంలో ఎక్కడ స్వచ్ఛమైన గాలి ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో కెనుక్ అనే చోట ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన గాలి ఉందని కనుగొన్నారు. ఇక్కడ గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు తమ వాతావరణ అధ్యయనాలకు ఇదే ప్రదేశాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ప్రదేశం ప్రపంచంలోనే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఎందుకు భిన్నంగా ఉంటుందో, అత్యంత పరిశుభ్రమైన గాలిని ఎందుకు కలిగి ఉందో తెలుసుకుందాం.

టాస్మానియాలోని కెనుక్ ప్రాంతంలోని గాలి పరిశుభ్రంగా ఉంటుంది. దీన్నే కేప్ గ్రిమ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడికి చేరే గాలులు నైరుతి ది...