Hyderabad, జూన్ 15 -- టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తొలిసారిగా కలిసి నటించిన సినిమా కుబేర. తెలుగు పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాకు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసిఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో కుబేర సినిమాను నిర్మించారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ వంటి ఐదు భాషల్లో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా కుబేర సినిమా విడుదల కానుంది.

ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పోయిరా మామ, 'ట్రాన్స్ ఆఫ్ కుబేర', పీపీ డమ్ డమ్ ...