భారతదేశం, మే 18 -- బ్రెజిల్​ నిర్మించబోతున్న కొత్త భవనం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అపార్ట్​మెంట్​ బిల్డింగ్​గా చరిత్ర సృష్టించనుంది. అమెరికా న్యూయార్క్​కి చెందిన సెంట్రల్​ పార్క్​ టవర్​ పేరిట ఉన్న ఈ రికార్డును బ్రెజిల్​లోని బిల్డింగ్​ దక్కించుకోనుంది. అయితే, ఇందులోని అపార్ట్​మెంట్​ ధరలు తెలిస్తే షాక్​ అవుతారు!

ఫార్ములా 1 రేసింగ్​ లెజండ్​ అయర్టన్​ సెన్నా స్ఫూర్తితో ఈ అపార్ట్​మెంట్​ బిల్డింగ్​ని రూపొందిస్తున్నారు. దీని పేరు సెన్నా టవర్​. దీని ఎత్తు 1,800 అడుగులు ఉంటుంది. మొత్తం 154 అంతస్తులు ఉంటాయి. టాప్​ ఫ్లోర్లలోని పార్టమెంట్​ల ధరలు 53 మిలియిన్​ డాలర్ల వరకు ఉంటాయి. అంటే అది రూ. 453 కోట్లు!

అపార్ట్​మెంట్​ టాప్​లో రెండు ట్రిప్లెక్స్​ పెంట్​హౌజ్​లను నిర్మిస్తున్నారు. 9700 స్క్వేర్​ ఫీట్​ విస్తీర్ణంలో ఇవి ఉంటాయి. తొలుత వీటి ధర 15.92 మిలియన...