భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​ రాజ్​లో జరుగుతున్న మహా కుంభమేళా 2025 రోజుకో రికార్డు బ్రేక్​ చేస్తోంది! కోట్లాది మంది భక్తులు కుంభమేళాను సందర్శించి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్​ జామ్​ రికార్డు కూడా ఇప్పుడు కుంభమేళా పేరిట ఉండేడట్టు కనిపిస్తోంది! మహా కుంభమేళాకు దారితీసే రహదారుల్లో 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని సమాచారం!

కుంభమేళాకు వెళ్లే రహదారుల్లో వాహనాలు కిటకిటలాడుతున్నాయి. ఎటుచూసినా వాహనాలు, వాటిల్లో భక్తుల పడిగాపులే కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనానికి హాజరు కావడానికి ఆసక్తి చూపుతున్న లక్షలాది మంది యాత్రికులు ఆదివారం కుంభమేళా ప్రాంగణానికి వందల కిలోమీటర్ల దూరంలో తమ కార్లలో చిక్కుకుపోయారు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అని నెటిజన్లు అభివర్ణిస్తున్...