Hyderabad, జూన్ 10 -- జూన్ 9 నుంచి కొత్త వారం ప్రారంభం అయ్యింది. ఈ వారం అనేక గ్రహాల సంయోగం చోటు చేసుకోనుంది. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం ఇది లాభాలను తీసుకు వస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్ 15న సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే మిధున రాశిలో గురువు, బుధుడు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో సూర్యుడు, బుధుడు సంయోగం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.

ఇదే సమయంలో, జూన్ 13న శుక్రుడు భరణి నక్షత్రంలోకి, గురుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. ఈ గ్రహాల సంచార ప్రభావం కొన్ని రాశులపై ఎంతో అనుకూలంగా ఉండనుంది. ఈ వారం మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. వారు కోరుకున్నవి పూర్తవుతాయి. వృత్తి పరంగా కూడా కలిసి వస్తుంది. మరి ఆ అదృష్ట రాశులెవరో ఇప్పుడు చూద్దాం.

ఈ వారం మిథున రాశి వా...