Andhrapradesh, అక్టోబర్ 12 -- ప్రధాని మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు. ఈనెల 16వ తేదీన ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. శ్రీశైలం ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మోదీ. సాయంత్రం జరిగే భారీ సభలో కూడా ప్రసంగింస్తారు. తాజాగా ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.

ఈనెల 16న ఉదయం 7.50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బయల్దేరుతారు. ఉదయం 10.20కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. ఆ తర్వాత 10.25 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ నుంచి సున్నిపెంట హెలిప్యాడ్‌కు బయల్దేరుతారు.

ఉదయం 11.05 గంటలకు సున్నిపెంట చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉదయం 11.10కి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. ఉదయం 11.45కి శ్రీశైలం మల్ల...