Andhrapradesh,delhi, ఏప్రిల్ 25 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రూ.65 వేల కోట్లతో చేపట్టనున్న అమరావతి రాజధాని ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.అమరావతి నిర్మాణానికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.

కశ్మీర్ లోని పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎస్ మధుసూదన్ రావు, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి మృతి చెందారు. ప్రధానితో భేటీ సందర్భంగా ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి తమ రాష్ట్రం నుంచి మద్దతు ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

"పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. ఇలాంటి పిరికిపంద హింసకు ఎంత ఖండన చేసినా సరిపోదు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్ర...