భారతదేశం, డిసెంబర్ 16 -- ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలతో ఇటీవల సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఎంపీలకు ప్రధాని క్లాస్ తీసుకున్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. సరైన దిశలో వెళ్లడం లేదని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారని, 8 మంది ఎంపీలు ఉన్నా.. ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతున్నామని ప్రశ్నించినట్టుగా ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా కీలక అంశాలపై మోదీ దిశానిర్దేశం చేశారు. ఈ వార్తలపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

సోషల్ మీడియాలో యాక్టివిటీ పెంచాలని ప్రధాని మోదీ సూచనలు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. లోపల జరిగింది ఒకటి, బయట ప్రచారం చేసింది మరొకటి అని పేర్కొన్నారు. నరేంద్రమోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశంపై వచ్చిన లీకుల మీద మండిపడ్డారు. 'మోదీతో చర్చించిన విషయాలు ఎలా బయటకు వచ్చాయి? ఎవరో కావాలనే లీక్ చేశారు. ఈ సమావేశంలో ప్రస్తావించిన విష...