భారతదేశం, నవంబర్ 19 -- నటి ఐశ్వర్య రాయ్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాదాలను తాకడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. బుధవారం (నవంబర్ 19) నాడు పుట్టపర్తిలో జరిగిన ఈ వేడుకలలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె కులం, మతం, ప్రేమపై పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చింది. ప్రసంగం తర్వాత ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాదాలను తాకింది.

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకల వేదికపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ తన ప్రసంగంలో సత్యసాయి బాబా సందేశాన్ని చెప్పింది. "ఒకే ఒక్క కులం ఉంది, అది మానవత్వం. ఒకే ఒక్క మతం ఉంది.. అది ప్రేమ అనే మతం. ఒకే ఒక్క భాష ఉంది.. అది హృదయం అనే భాష. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు.. ఆయన సర్వాంతర్యామి" అని ఐశ్వర్య చెప్పడ...