భారతదేశం, నవంబర్ 14 -- లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ మూవీ డ్యూడ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (నవంబర్ 14) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులో మమితా బైజు హీరోయిన్. ఈ చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.

డ్యూడ్ ఓటీటీ

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన జెన్ జెడ్ రొమాంటిక్ మూవీ డ్యూడ్ ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఓటీటీలో డ్యూడ్ మూవీని చూడొచ్చు. ఇందులో ప్రదీప్, మమితా, ఆర్.శరత్ కుమార్, ఐశ్వర్య శర్మ తదితరులు నటించారు. దీనికి కీర్తిశ్వరన్ డైరెక్టర్.

రూ.100 కోట్లు

డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇది రూ.100 కోట్లకు పైగా ...