భారతదేశం, అక్టోబర్ 29 -- థియేటర్లలో అదరగొట్టిన తమిళ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ 'డ్యూడ్' ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓటీటీ రిలీజ్ ల్లో ఇది ఒకటి.

దర్శకుడు కీర్తిశ్వరన్ కోలీవుడ్ అరంగేట్ర చిత్రంగా వచ్చిన డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఈ తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం.. ధ్రువ్ విక్రమ్ 'బైసన్: కాలమాడన్', హరీష్ కళ్యాణ్ 'డీజిల్' వంటి ఇతర చిత్రాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది. అయినా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ 'డ్యూడ్' సినిమా అధికారిక స్ట్రీమింగ్ హక్కులను పొందింది. మీడియా నివేదికల ప్రకారం ఈ చిత్రం హిం...