భారతదేశం, సెప్టెంబర్ 18 -- క్షేత్ర స్థాయి ప‌రిస్థితులు, అధ్యయనం, భ‌విష్యత్తు అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం భార‌త‌దేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ‌లో విద్యా రంగాన్ని స‌మూల ప్రక్షాళన చేయాల‌ని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై రాష్ట్ర సచివాలయంలో విద్యా వేత్తలు, నిపుణులతో జరిగిన స‌మావేశంలో సీఎం మాట్లాడారు. విద్యా రంగంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, నూతన విద్యా విధానం రూపకల్పనలో పరిగణలోకి తీసుకోవలసిన పలు అంశాలను వివరించారు.

విద్యా రంగంపై అయ్యే వ్యయానికి ప్రభుత్వం వెనుకాడదని, ప్రత్యేక విద్యా కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి మౌలిక వ‌స‌తులు, ప్రమాణాలు మెరుగుపరచాలని నిర్ణయించినట్టుగా సీఎం తెలిపారు. విద్యపై చేసే వ్యయాన్ని వ్యయంగా కాక పెట్టుబ...