భారతదేశం, జనవరి 19 -- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటించారు. ఈ పర్యటనలో నాగర్ కర్నూల్ పట్టణంలోని ఎండబెట్ల దగ్గర ఉన్న కేసరి సముద్రం మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన పనులను మంత్రి దామోదర రాజనర్సింహ స్థానిక శాసన సభ్యుడు డా. రాజేష్ రెడ్డి , శాసన మండలి సభ్యుడు దామోదర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిథిలోని వివిధ వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణ పనుల కోసం రూ. లు 20 కోట్లతో శంకుస్థాపన చేశారు. 9 కోట్ల రూపాయలతో పట్టణంలోని జూనియర్ కాలేజీ నూతన కళాశాల భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నాగర్ కర్నూల్ పట్టణంలో 245 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇందిరా మహిళా శక్తి పథకం 70,80,324 రూపాయల విలువైన చ...