Telangana, జూన్ 3 -- వచ్చే ఆగస్టు 15 నాటికి ధరణి నుంచి పూర్తిస్థాయిలో విముక్తి కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. భూభారతితో భూసమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని స్పష్టం చేశారు. ఇవాళ మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూభారతి సర్వే ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ విలేజ్ లో అధికారులే గ్రామాలకు వచ్చి సర్వే చేస్తారని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇక మీదట ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రైతులు తిరగనవసరంలేదన్నారు. ప్రతి రైతు భూమికి ఒక భూధార్ నెంబర్ ఇస్తామని తెలిపారు.

"రాష్ట్రం లో 413 రెవెన్యూ గ్రామాలలో నక్షలు లేవు, అయిదు గ్రామాలను నక్షల కోసం సర్వే చేసేందుకు ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ములుగుమాడ...