Telangana, జూలై 2 -- రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు రైతుల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. అయితే వీటిని పూర్తిస్థాయిలో ఆన్ లైన్ చేసి. పరిష్కారం చూపనుంది. ఇప్పటికే ఆన్ లైన్ నమోదు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును స‌మ‌గ్రంగా ప‌రిశీలించి అర్హమైన అన్నింటినీ సానుకూలంగా ప‌రిష్కరించాల‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తాజాగా అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌తి ద‌ర‌ఖాస్తుపై స‌రైన విచార‌ణ జ‌ర‌పాల‌ని. సంబంధిత వ్య‌క్తుల‌కు నోటీసులు జారీ చేయాల‌న్నారు. అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు, రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి ఆధారాల‌న్...