Andhrapradesh, ఆగస్టు 2 -- ఏపీలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ స్కీమ్ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానున్నాయి.

అన్నదాత సుఖీభవతో ఏపీలోని 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో ప్రతి రైతు ఖాతాల్లో రూ.7 వేలు జమవుతాయి. రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5వేల చొప్పున మొత్తం రూ.2342.92 కోట్లు విడుదల చేయగా. కేంద్రం వాటాగా పీఎం కిసాన్ (రూ.831.51) నిధులు కూడా జమయ్యాయి.

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు...