Hyderabad, మార్చి 19 -- ప్రతిరోజూ పాలు తాగమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. పాలలో ఉండే పోషకాలు పెద్దలకూ, పిల్లలకు కూడా అవసరం. అయితే మగవారు ప్రతిరోజూ రాత్రి పాలల్లో చిటికెడు లవంగాల పొడి వేసి నానబెట్టి తాగడం వల్ల వారికున్న ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. ఆయుర్వేద వైద్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

బిజీ జీవన శైలిలో ఎంతోమంది ఒంటరిగా జీవిస్తున్నారు. అలాగే ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యల వల్ల తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వారిలో టెన్షన్ పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి తగ్గించడానికి రాత్రి పడుకునే ముందు లవంగం పాలు తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే లవంగాల పాలలో జింక్, రాగి, మెగ్నీషియం వంటివి అధికంగా ఉంటాయి. ఇవి మనస్సును ప్రశాంత పరుస్తాయి.

రాత్రిపూట లవంగం పాలు తాగడం వల్ల మగవారికి అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే వారు ఉదయం అంతా కష్టప...