Telangana,hyderabad, జూలై 12 -- భూ స‌మ‌స్య‌ల‌పై సామాన్యుల‌కు మెరుగైన సేవ‌లందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలనాధికారి (జీపీవో)ని నియమిస్తామన్నారు. ప్ర‌తి మండ‌లానికి భూ విస్తీర్ణాన్ని బ‌ట్టి నాలుగు నుంచి ఆరుగురు వ‌ర‌కు లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను నియ‌మిస్తున్నట్లు ప్రకటించారు.

ఇందుకు సంబంధించి ఈనెల 27వ తేదీన శిక్ష‌ణ పొందిన లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌కు ప్రభుత్వం తుది ప‌రీక్ష నిర్వహిస్తుందని చెప్పారు. ఆ త‌ర్వాత 28, 29 తేదీల్లో జె.ఎన్.‌టి.యు ఆధ్వ‌ర్యంలో ల్యాబ్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష ఉంటాయన్నారు. ఆగ‌స్టు 12వ‌ తేదీన ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తామని వెల్లడించారు. ఈ ప‌రీక్షలో ఉత్తీర్ణులైన అభ్య‌ర్దుల‌కు 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్ష‌ణ ఉంటుందని వివరించారు.

P...