భారతదేశం, నవంబర్ 10 -- సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 70 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ, కంపెనీలకు భూముల కేటాయింపుపై సీఆర్డీఏ నిర్ణయాలు, పరిశ్రమలో ఏర్పాటులో రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ, పేదలకు ఇళ్లతోపాటు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు.

లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. క్వాంట కంప్యూటింగ్ సంస్థలు, నిపుణులు, క్వాంటం కంప్యూటింగ్ విడిభాగాల సంస్థలకు ఏపీ కేంద్రంగా మారుతోందన్నారు. విశాఖ జిల్లా కాపులుప్పాడలో పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. తిరుపతి, ఓర్వకల్లులో పరిశ్రమల ఏర్పాటు కానున్నాయన్నారు. డెడికేటెడ్‌ డ్రోన్‌ ఇండస్...