Andhrapradesh, సెప్టెంబర్ 4 -- ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందిస్తారు.

ఈ విధానం ద్వారా రాష్ట్రంలో కోటి 63 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. 6 గంటల్లోనే వైద్య చికిత్స అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ అందుబాటులోకి తీసుకువస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి 2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్స్ ఉంటాయి. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరిస్తుంది.

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై అక్రమ నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండ...