భారతదేశం, జూన్ 15 -- రియల్ లైఫ్ ఇన్సిడెంట్లతో ఒరిజినల్ మూవీస్, సిరీస్ తీసి ఆడియన్స్ మనసులు గెలుచుకుంటున్న ఈటీవీ విన్ మరోసారి అలాంటి సిరీస్ తో వస్తోంది. ఈ సారి ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్ లైఫ్ ను స్టోరీ లైన్ గా తీసుకుని ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) సిరీస్ ను తీసుకొస్తోంది. ప్రతి ఇంటర్ స్టూడెంట్ స్టోరీ ఇది అంటూ డిజిటల్ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఖరారు చేసింది. మరి ఈ సిరీస్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో చూసేయండి.

ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రూపుదిద్దుకున్న ఏఐఆర్ స్ట్రీమింగ్ డేట్ ను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. జులై 3న ఈ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ ఆదివారం (జూన్ 15) ప్రకటించింది. ''ఇక యుద్ధం మొదలు పెడదామా? ఇది ప్రతి ఇంటర్ స్టూడెంట్ స్టోరీ. ఈటీవీ విన్ యాప్ లో ఏఐఆర్ ను జులై 3న చూడండి'' అని ఈటీవీ విన్ ఎక్స్ లో పోస్టు...