భారతదేశం, జనవరి 9 -- రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. మూడు దశల్లో 175 ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు చేస్తుండగా మొదటిదశలో 55 ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 16 ప్రారంభం కాగా మరో 39 పార్కులకు శంఖుస్థాపన చేశారు.

ఎంఎస్ఎంఇ పార్కు పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి. నిర్మాణ పనులపై ఆరా తీశారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఎంఎస్ఎంఇ పార్కులను ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించా...