భారతదేశం, మే 23 -- మెదక్ పేరు గుర్తొస్తేనే.. ఇందిరమ్మను తలచుకుంటాం.. ఇందిరమ్మ గుర్తొచ్చిన ప్రతీసారి మెదక్ గుర్తొస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన చివరి శ్వాస వరకు మెదక్ ఎంపీగా కొనసాగిన నాయకురాలు ఇందిరమ్మ అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందన్న సీఎం.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచి, భూసేకరణను వేగవంతం చేశామని వివరించారు.

'త్వరలో హ్యుందాయ్ కార్ల తయారీ కంపెనీ ఇక్కడ పనులు మొదలుపెడతారని చెప్పడానికి సంతోషిస్తున్నా. నిమ్జ్ భూ నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదికగా ప్రకటిస్తున్నా. ఆ కుటుంబాలకు భోజనాలు పెట్టి ఇండ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నాం. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ...