భారతదేశం, మే 21 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే పల్లె పండగ, అడవి తల్లిబాట కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు.

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... 'మన ఊరు- మాటామంతీ' పేరుతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు...సరాసరి కలిసేందుకు సమయం కుదరని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్.. ఒక ఊరితో ఒకరోజు మాట్లాడేలా ఈ కార్యక్రమాన్ని రూపొదించారు.

గ్రామస్థులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి....వారి సమస్యలకు దాదాపు అక్కడే పరిష్కారం చూపేలా పవన్ ఆదేశాలు ఇవ్వనున్నారు.

రేపు మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీ...