భారతదేశం, జూలై 21 -- గజ్వేల్: "తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం రెండేళ్లలోనే ఆగమాగమైంది. పాలన చేతగాక, దిక్కుమాలిన మాటలు చెబుతూ, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు" అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజ్ఞాపూర్‌లోని ఎస్ఎల్‌ఎన్ కన్వెన్షన్‌లో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.

"ఇటీవల నిర్వహించిన సర్వేల ప్రకారం, రాష్ట్రంలోని 31 జిల్లా పరిషత్‌లలో 16 నుంచి 18 పరిషత్‌లను బీఆర్ఎస్ సొంతం చేసుకోబోతోంది. సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు ఉంటే, మెజార్టీ మండలాల్లో గెలవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ఒక కుటుంబంలా పని చేయాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ, అతివిశ్వాసం పనికిరాదు" అని హరీశ్ ...