Hyderabad, జూలై 28 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'హరి హర వీరమల్లు' జూలై 24న విడుదలై తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. తర్వాత మందకోడిగా కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే, మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు హిందూ దేవాల‌యాల‌ను నాశ‌నం చేసిన చారిత్ర‌క క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి స్పంద‌న బాగానే ఉంది.

ఈ సంద‌ర్భంగా హరి హర వీరమల్లు సినిమా గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. "వేద గ్రంథాల‌ను నాశ‌నం చేసిన‌ప్పుడు 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు (పవన్ కల్యాణ్) బ‌లంగా నిల‌బ‌డ్డాడు. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల ఇబ్బందుల‌ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు" అని డైరెక్టర్ తెలిపారు.

"వేదాల‌లోని జ్ఞానాన్ని అంతా సంపాదించుకుని త‌నే ఒక వేద పండితుడిగా మార‌టంతో వాటిని నాశనం చేయ‌టానికి వీలుకాకుండా ఉండిపోయింది. వీర‌మ‌ల్లు చిన్న‌ప్ప‌టి నుంచి గుడిలో...