భారతదేశం, ఫిబ్రవరి 23 -- 'ది కేరళ స్టోరీ 2' మూవీ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ సినిమాలో ఒక హిందూ యువతితో ముస్లిం కుటుంబం బలవంతంగా బీఫ్ (గొడ్డు మాంసం) తినిపించే సీన్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన నటుడు ప్రకాష్ రాజ్ ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా, చిత్ర దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ ఆయనను 'మేధోపరమైన దివాలాకోరు' అని తీవ్రంగా విమర్శించాడు. తాజాగా దర్శకుడి వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ పరోక్షంగా, తనదైన శైలిలో చురకలు అంటించాడు.

హిందీ మూవీ 'ది కేరళ స్టోరీ 2' ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఒక సీన్ లో ఓ అమ్మాయి చేత బలవంతంగా బీఫ్ (Beef) తినిపించే సీన్ ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. ఈ వివాదం ఇప్పుడు సినీ ప్రముఖుల...