Andhrapradesh,praksam, సెప్టెంబర్ 17 -- ప్రకాశం జిల్లాలో తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో దారుణం వెలుగు చూసింది. భార్య రెండు చేతులు తాళ్లతో పాక గుంజలకు కట్టేసి. బెల్టుతో బాదాడు ఓ భర్త. జుట్టుపట్టుకుని వెనక్కి విరిచి కాళ్లతో తన్నుతూ హింసించాడు. ఒకరోజు రాత్రంతా అదే పనిగా కొడుతూ దారుణానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లటంతో.. విచారణ చేపట్టారు.

సెప్టెంబర్ 13వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక వివరాల ప్రకారం.. కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన బాలాజీకి భాగ్యలక్ష్మీతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే మద్యానికి బానిసైన బాలాజీ.. భార్యను తీవ్రంగా హింసించేవాడు.

ఈ క్రమంలోనే అతను కుటుంబాన్ని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అయితే ఇటీవ...