Andhrapradesh, అక్టోబర్ 10 -- ప్రకాశం జిల్లాలోని పొగాకు కర్మాగారంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రూ.550 కోట్ల విలువైన పొగాకు దగ్ధమైంది. ఫ్యాక్టరీలోని 'ఏ', 'బి' బ్లాకులను మంటలు చుట్టుముట్టడంతో సుమారు 11,000 టన్నుల పొగాకు కాలిపోయిందని ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

పొగాకు కర్మాగారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మంటలను అదుపులోకి తెచ్చామని. అయితే స్థలం నుంచి దట్టమైన పొగ వెలువడుతోందని అధికారి ఒకరు తెలిపారు. ఐదు అగ్నిమాపక యంత్రాలను మోహరించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుండగా, మిగతా అన్ని కర్మాగారాలు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సదరు అధికారి స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఘటనా స...