భారతదేశం, ఆగస్టు 4 -- రిజిస్ట్రర్డ్ పోస్ట్ ఈ పేరు వినగానే అప్పటితరం వారికి తెలియని ఎమోషన్. భారత తపాలా శాఖలో అత్యంత విశ్వసనీయ సేవ అయిన రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ తన 50 ఏళ్ల శకానికి ముగింపును ఇస్తోంది. ఈ సేవ సెప్టెంబర్ 1, 2025 నుండి పోస్టాఫీసులో అందుబాటులో ఉండదు. ఈ నెలాఖరు నాటికి ఈ సేవను ముగించి, సేవా కార్యకలాపాలను ఆధునీకరించడానికి స్పీడ్ పోస్ట్‌తో విలీనం చేయాలని భారత తపాలా శాఖ నిర్ణయించింది.

దేశ పోస్టల్ వ్యవస్థలో రిజిస్టర్డ్ పోస్ట్ సేవ ప్రవేశపెట్టబడి 50 సంవత్సరాలు అయింది. కీలకమైన సర్టిఫికేట్లు, ఉద్యోగ నియామక పత్రాలు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ ఉత్తర్వులను రిజిస్ట్రర్డ్ పోస్ట్ ద్వారా ప్రజలకు చేరవేసేది. ఇది ప్రజలకు చాలా నమ్మకమైనది. ఈ సేవ ద్వారా ముఖ్యమైన పత్రాలు పంపేవారు. ప్రభుత్వ ఉత్తరప్రత్యుత్తరాలు కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో ముఖ్యమైన ...